జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్-2 సందడి మొదలైంది. ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వస్తున్న లీక్స్ హైప్ పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఇటు సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగులో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం భారీగా పోటీ పడుతున్నారంట నిర్మాతలు. డిమాండ్ ఎక్కువగానే ఉండటంతో మూవీ మేకర్స్ కూడా బాగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా రూ.120 కోట్ల దాకా డిమాండ్ పెరిగిందంట. అంత ఇచ్చేందుకు తెలుగు నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. నాగవంశీ, సునీల్ నారంగ్ లు ప్రధానంగా మూవీ కోసం చర్చలు జరుపుతున్నారంట.
త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రాబోతున్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఈ మూవీ నుంచి సాలీడ్ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దానిపై అధికారిక ప్రకటన రాబోతోంది. ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ ఇదే. అటు నార్త్ లో ఇటు సౌత్ లో మంచి బిజినెస్ జరుపుకుంటోంది ఈ సినిమా. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ యాక్షన్ సీన్లు చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి పార్టులో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించగా భారీ హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు.