హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ కేటుగాళ్లు బెదిరంపులు చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందని అన్నారు. అలాంటి వారు ఎవరైనా వుంటే గుర్తించి తమ దృష్టికి తేవాలని రంగనాథ్ ప్రజలను కోరారు. బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్ల కు సామజిక కార్యకర్తల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు వున్నాయని మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎలాంటి సమస్య రాకుండా కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. హైడ్రా కు ఫిర్యాదు చేస్తామని కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు బిల్డర్లను బెదిరింపులు పాల్పడుతున్నారని అన్నారు. హైడ్రా పేరుతొ డబ్బు వసూళ్ల కు పాల్పడితే జైలుకే అని హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులో తీసుకున్న ఘటనపై హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ స్పందించారు.
హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడితే చర్యలు..
