రామ్‌నగర్‌లో హైడ్రా బుల్డోజర్లు..

hidra-30.jpg

వీకెండ్‌ వచ్చిందంటే హైదరాబాద్‌ నగరవాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ వచ్చి తమ నిర్మాణాలపై పడుతాయోనని భయాందోళనలకు గురవుతున్నారు. రాంనగర్ లోని మల్లెమ్మ గల్లీలోని 1-9-189 నెంబర్ గల స్థలం తమదని విక్రం యాదవ్ పేర్కొన్నారు. ఈ స్థలంలో అక్రమంగా కళ్ళు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు స్థానికుల ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని GHMC రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన 24 గంటలకే చర్యలు ప్రారంభించింది. హైడ్రా పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు భారీగా మొహరించాయి.

Share this post

scroll to top