నాకు శాంతిని కొనడానికి సమయం కావాలి..

rasikana-10.jpg

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీమ్, హైపర్, జై లవకుశ, రాజా ది గ్రేట్, ఆక్సిజన్, చ్ చేసి చూడు, తొలిప్రేమ, ప్రతి రోజు పండగే, వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, తిరు వంటి సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసుకదా మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ లోనూ ఐటెం సాంగ్స్‌లో చిందులేస్తూ ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది ఈ అమ్మడు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది.

Share this post

scroll to top