తెలంగాణలో రాబోయే రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని పారాదీప్‌కు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పింది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ 24వ తేదీ వరకు తీవ్ర తుఫానుగా మారుతుందని హెచ్చరించింది.
తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం..
