గురూజీ బన్నీ కోసం ప్లాన్ ఏంటి..

bunni-08.jpg

అల్లు అర్జున్‌కు పుష్ప హ్యాంగోవర్ ఇప్పట్లో దిగడం కష్టమే. ఎందుకంటే ఐదేళ్లు ఆ పాత్రతో సహజీవనం చేసారు బన్నీ. అంత త్వరగా ఆ మత్తు వదలదు. త్వరలోనే ఈయన త్రివిక్రమ్ సినిమాతో జాయిన్ కానున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలే వచ్చాయి. కానీ ఈ సారి అంతకుమించి అంటున్నారు గురూజీ. అల్లు అర్జున్ కోసం తొలిసారి ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఈ కాంబోలో మైథలాజికల్ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ముందు నుంచే పురాణాలపై గురూజీకి పట్టు ఎక్కువ. కార్తికేయ స్వామి నేపథ్యంతో త్రివిక్రమ్ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. యుద్ధానికి ఆధ్యుడిగా కార్తికేయున్ని కొలుస్తారు.. ఆయన్నే స్కంద అని కూడా పిలుస్తారు.

తెలుగులో అసలు సిసలైన మైథలాజికల్ సినిమా వచ్చి చాలా ఏళ్లైంది. అందుకే ఈ కాన్సెప్ట్‌తో సినిమా చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను 400 కోట్లకు పైగానే బడ్జెట్‌తో నిర్మించబోతున్నాయి. సమ్మర్ తర్వాత ఈ చిత్రం మొదలు కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం మేకోవర్ అవుతున్నారు అల్లు అర్జున్. అన్ని సక్రమంగా జరిగితే ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ ఊచకోత పక్క అంటున్నారు సినీ ప్రేమికులు. 

Share this post

scroll to top