బాలయ్య చికెన్‌ సెంటర్‌లో కుళ్లిపోయిన చికెన్..

cheken-18.jpg

హైదరాబాద్‌ బేగంపేటలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తుపోయారు. బాలయ్య చికెన్‌ సెంటర్‌లో పెద్ద మొత్తంతో కుళ్లిపోయిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు. 700 కిలోల కుళ్లిన చికెన్‌ సీజ్ చేశారు. కుళ్లిన చికెన్‌కు కెమికల్స్‌ కలిపి అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ చికెన్‌ను హోటళ్లు, జనతా బార్లు, కర్రీ పాయింట్లకు విక్రయిస్తున్నారట.  బాలయ్య చికెన్‌ సెంటర్ సీజ్ చేసిన అధికారులు, యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. ఇది కలికాలం కాదు కల్తీకాలం అన్నట్టుగా మారింది. ఎక్కడ చూసినా నకిలీ వస్తువులు, కల్తీ సరుకులే.. ఏది ముట్టుకోవాలన్నా భయం ఏది తినాల్నా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కల్తీ సరుకులకు అడ్డాగా మారింది హైదరాబాద్. 

Share this post

scroll to top