సెన్సేషనల్ హిట్ పుష్ప కి సీక్వెల్ గా వస్తున్న ఈ పుష్ప 2 సినిమాపై భారీ హైప్ నెలకొంది. అయితే ఎప్పుడో ఆగస్ట్ 15కే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇలా ఒక లాస్ట్ కు డిసెంబర్ 6కి ఫైనల్ అయ్యిన ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 6న తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది డిసెంబరు 6న కాకుండా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో దింపే ఛాన్స్ ఉన్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే పుష్ప 2 ప్రీపోన్ అయ్యిందో లేదో అనే దానిపై అధికారికంగా క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
మళ్లీ మారిన రిలీజ్ పుష్ప 2 రిలీజ్ డేట్..
