గత కొన్నాళ్ల కితం వరకు ఇండియన్ సినిమా దగ్గర నేషనల్ క్రష్ ఎవరైనా ఉన్నారు అంటే అది గూగుల్ లో కొట్టినా కూడా రష్మిక మందన్నా అంటూ వచ్చేది. కానీ తనతోనే ఓ భారీ హిట్ సినిమాలో నటించి తన నెక్స్ట్ సినిమాకి ఆమె టైటిల్ నే కొట్టేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ మాత్రం త్రిప్తి దిమ్రి అని చెప్పుకోవాలి. అప్పటి వరకు బాలీవుడ్ సినిమా దగ్గర పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ గా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ రాని ఫేమ్ మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ తో చేసిన వైలెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “ఆనిమల్” తో వచ్చేసింది. ఈ సినిమాలో సెకండాఫ్ లో ఒక సర్ప్రైజింగ్ ప్యాకింగ్ లా కనిపించిన త్రిప్తి దిమ్రి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
ఇంకా ఈమె నుంచే సినిమా మొత్తం తిరుగుతుంది అని చెప్పాలి. కాగా ఇలా ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీగా మారిపోయిన ఈమె మరిన్ని ఆఫర్స్ తో దూసుకెళ్తుంది. రీసెంట్ గానే ఆమె నటించిన అడల్ట్ కామెడీ చిత్రం “బ్యాడ్ న్యూజ్” మంచి వసూళ్లు కూడా రాబడుతుంది. మరి ఈమె లైనప్ లో డెఫినెట్ గా ఆనిమల్ సీక్వెల్ చిత్రం “ఆనిమల్ పార్క్” ఉంటుంది అని అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ఈమె ఉంటుందా ఉండదా అనేది ఒక ఊహించని ప్రశ్నగా మారింది. సందీప్ ఆల్రెడీ సినిమా అనౌన్స్ చేసేసాడు. కానీ ఈ సినిమా విషయంలో త్రిప్తి దిమ్రి పంచుకున్న కొన్ని కొత్త విషయాలు వైరల్ గా మారాయి. నిజానికి ఆ సినిమా కోసం నాకేమి తెలీదని అసలు ఎప్పుడు ఆ సినిమా మొదలవుతుంది, స్క్రిప్ట్ కూడా పూర్తయ్యిందో లేదో నాకు తెలీదు అంటూ చెప్పుకొచ్చింది.