తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి..

ravanth-2-1.jpg

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. వేలాది బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తెలంగాణలో కురిసిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు తక్షణ సాయం అందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌ లో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, రోడ్లపై నీరు నిలిచిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని నగర కమిషనర్లకు సీఎం ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లకు ప్రాధాన్యతా క్రమంలో త్వరతగతిన మరమ్మతులు నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఖమ్మం బయలుదేరారు.

Share this post

scroll to top