జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎందుకు కలుస్తున్నారు..

ntr-7.jpg

క్రేజీ కాన్సెప్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘ఆయ్’ మూవీని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఈ సినిమా హడావిడే కనిపిస్తోన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నార్నే నితిన్ హీరోగా నటించిన ‘ఆయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారన్న దానిపైనా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దీనికి టాలీవుడ్ టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాజరవుతారని తెలిసింది. ఇప్పటికే చిత్ర యూనిట్ వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.

Share this post

scroll to top