మెగాస్టార్‌కు విలన్‌ గా ఆ టాలీవుడ్ యంగ్ హీరో..

anil-26.jpg

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘MEGA 157’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితి రావు హైదరి, పరిణీతి చోప్రా హీరోయిన్లుగా నటించనున్నారని వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే ఉగాది సందర్భంగా అధికారికంగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమాకి సంబంధించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు విలన్‌కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరో కార్తికేయ విలన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని, నెగెటివ్ రోల్ చేయడానికి హీరో కూడా రెడీగా ఉన్నారని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారుతుందని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే సీరియస్ రోల్‌లో ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నారు. చిరుతో ఢీ అంటే ఢీ అనేలా ఉంటే బాగుటుందని, అలా కాకుండా కామెడీ విలన్‌గా చూపిస్తే ఫలితం ఉండదని అంటున్నారు. మరికొందరు మాత్రం ఈ కాంబో అస్సలు ఊహించలేదు భయ్యో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share this post

scroll to top