ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారు కవిత. విచారణ జరిపిన కోర్టు.. కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై పరిశీలించింది. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే పిటిషన్ విచారణను జులై 22కు వాయిదా వేసింది. వాయిదా వేస్తున్న విషయాన్ని ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు కస్టడీలో ఉండాలని ఆదేశించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. 100 రోజులు దాటినప్పటికీ ఆమెకు బెయిల్ విషయంలో అనేక ఇబ్బందులు తప్పడంలేదు. ఈడీ కేసుతో పాటూ సీబీఐ కూడా ఇందులో జోక్యం చేసుకుంది. చార్జ్ షీట్లో కవిత పేరును పేర్కొంది. దీనిపై స్పందించారు కవిత తరఫు న్యాయవాది. విచారణ సమయంలో సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత తరఫున సీనియర్ న్యాయవాది నితీశ్ రాణా వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్ ఇచ్చారు సీబీఐ తరఫు న్యాయవాది.
కవిత లిక్కర్ కేసుపై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరులో జాప్యం అందుకేనా..
