కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం.. ఉన్న పథకాలు తీసేశారని ప్రజలు ఆలోచిస్తున్నారు.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.. బీఆర్ఎస్‌లోకి నాయకులు తిరిగి వస్తారు.. పార్టీ కేడర్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి.. అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం యాదవులకు గొర్రెలు ఇవ్వడం లేదని.. చేప పిల్లల పంపిణీ, ఫీజ్ రీయంబర్స్‌మెంట్ తీసేశారు.. అంటూ ఫైర్ అయ్యారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కేసీఆర్.. ఉన్న పథకాలు తీసేసిన ప్రభుత్వంపై.. అప్పడే ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుబాటు కచ్చితంగా వస్తుందని నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం.. టార్చ్ లైట్ పట్టుకొని జనమే వస్తారు..
