ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఏకంగా ఆ పార్టీ మొత్తం 44 నియోజకవర్గాల్లో అప్రతిహతంగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు అధికార ఆమ్ఆద్మీ పార్టీ మాత్రం కేవలం 26 స్థానాల్లో అది కూడా వందల్లో మాత్రమే లీడ్‌లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే , మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతో కేజ్రీవాల్ ఆమ్‌ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని అన్నారు. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న కేజ్రీవాల్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయని మండిపడ్డారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ తో ఆప్ ప్రభుత్వంతో పాటు కేజ్రీవాల్ బద్నాం అయ్యారని కామెంట్ చేశారు. అందుకే ఢిల్లీ ప్రజలకు ఆమ్ఆద్మీ పార్టీని ఓడగొట్టారని అన్నా హజరే అన్నారు.
కేజ్రీవాల్‌కి ముందే చెప్పా అయినా పట్టించుకోలేదు..
