టెక్నాలజీ పెరుగుతున్న ఈ సమయంలో దగ్గర, దూరం అనే పదాలకు అసలు విలువ ఉంటుందా? దగ్గరైతే ఏంటి? దూరంగా ఉంటే ఏంటి? అని అనేవాళ్లు కోకొల్లలు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు దగ్గరితనానికీ, డిస్టెన్స్ కీ ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ల విషయంలో ఈ టాపిక్‌ని బాగా అర్థం చేసుకుంటున్నారు మేకర్స్. సినిమాకు పని చేసే టెక్నీషియన్ ఎక్కడి నుంచి వచ్చినా పక్కా లోకల్‌లాగా బిహేవ్ చేయాలి.
టెక్నీషియన్లే అలా ఉన్నప్పుడు, ఆర్టిస్టులు ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోవాలి. షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంటే ఎంతటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అక్కడే ఉండి పూర్తి చేసివ్వాలి. అదీ కమిట్‌మెంట్ అంటే. కల్కి సెట్లో అమితాబ్ వాష్‌రూమ్‌కి వెళ్లాలన్నా కెప్టెన్ పర్మిషన్ తీసుకునే వెళ్లేవారట. అలాంటి కమిట్‌మెంట్ ఉన్న హీరోయిన్లు కావాలిప్పుడు. సీనియర్లు కాజల్, తమన్నా, సమంత… ఎవరైనా సరే, ప్రాజెక్టు జరుగుతున్నన్నాళ్లూ మేకర్స్ కి అందుబాటులో ఉండేవారు. సెట్స్ లో ఇతరత్రా కారణాల వల్ల షూటింగ్‌కి బ్రేకులు పడ్డ రోజులున్నాయి కానీ, హీరోయిన్ల కాల్షీట్ లేక ఆగిన సందర్భాలు చాలా అరుదు. వీలైతే ఇతర నిర్మాతలకు నచ్చజెప్పి, సెట్స్ మీదున్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసేవారు మన భామలు.
కానీ ఇప్పుడు నార్త్ నుంచి వస్తున్న నాయికల్లో అదే కొరవడిందా? అనే టాక్ నడుస్తోంది. దేవరలో నటిస్తున్నారు జాన్వీ కపూర్. ఇటీవల ఫుడ్ పాయిజిన్ అయిందని ఆమె ముంబైకి వెళ్లారు. దీంతో ఇప్పుడు షెడ్యూల్‌కి గ్యాప్ వచ్చింది. భారీ స్టార్‌కాస్టింగ్ ఉన్న సీన్లను జాన్వీ డేట్లతో మ్యాచ్ చేసి షూట్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఇది ఒక్క జాన్వీ విషయంలోనే కాదు, కియారా విషయంలోనూ వినిపించిన మాట. కియారా కాల్షీట్లు అడ్జస్ట్ కాకపోవడంతో గేమ్ చేంజర్‌కి కూడా ఇలాగే జరుగుతోందనే మాట వినిపిస్తోంది. రీసెంట్‌గా దీపిక పదుకోన్ కాల్షీట్లు కుదరకపోవడంతో కల్కికి కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయట. అన్నివిధాలా మనకు అందుబాటులో ఉండే కొత్త తారలను ఎంకరేజ్ చేయాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు క్రిటిక్స్. ప్రతిభావంతులను ప్రోత్సహించి ప్యాన్ ఇండియా రేంజ్‌లో పబ్లిసిటీ ఇచ్చిన క్రెడిట్ మన మేకర్స్ కి ఎప్పుటినుంచో ఉంది. దాన్ని మళ్లీ గుర్తుచేసుకోవాలంటూ సలహాలు అందుతున్నాయి.