రాహుల్ పై కిషన్‌ రెడ్డి హాట్ కామెంట్స్..

kishan-reddy-24-.jpg

దేశంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం కేంద్రంగా పని చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబ సభ్యులను తప్పా ఎవరినీ పట్టించుకున్న పాపాన పోలేదని కామెంట్ చేశారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో నిశ్శబ్ధ విప్లవం వచ్చిందని అన్నారు. దళిత నేతలపై కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచే కక్ష కట్టిందని ఆరోపించారు. నాడు హిందీ భాష వ్యాప్తి కోసం కర్పూరి ఠాకూర్ ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని బిహార్‌ కు రెండు సార్లు సీఎంగా వ్యహరించారని గుర్తు చేశారు.

అతి తక్కువ సమయంలోనే ఇందిరా గాంధీని జనతా పార్టీ ఓడించి ఆ ఓటమి రుచిని ఆమెకు చూపించిందని అన్నారు. ఆ తరువాత అనేక కుట్రలు చేసి జనతా పార్టీని కాంగ్రెస్ సమాధి చేసిందని ఫైర్ అయ్యారు. నెహ్రూ కుటుంబం మాత్రమే దేశాన్ని పాలించాలి అన్నట్లుగా హస్తం పార్టీ భావిస్తుందని చురకలంటించారు. నేడు రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించ లేదని అన్నారు. మదర్ ఆప్ డెమొక్రసీ అంటే భారత్ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ అనేకసార్లు దుర్వినియోగం చేసిందని అన్నారు. అంబేద్కర్ జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ ఆయనను అవమానిస్తూనే వచ్చిందని ధ్వజమెత్తారు. రాజ్యాంగంపై మాకు రాహుల్ గాంధీ సర్టిఫికెట్ అక్కర్లేదని మండిపడ్డారు.

Share this post

scroll to top