కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ తనకు మంత్రి పదవి వస్తుందని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. భువనగిరి ఎంపీ స్థానం కోసం నిద్రహారాలు మాని తాను గెలిపించానని, పార్టీ కోసం ఎంతైనా కష్టపడతానని అన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే అది పార్టీకి, ప్రజలకే లాభమని తెలిపారు. మంత్రి పదవీ ఆశించి తాను ఏ పనులు చేయనని వెల్లడించారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి తగిన గౌరవం అదే వస్తుందని అన్నారు.
మంత్రి పదవీ ఇస్తే పార్టీకే లాభం..
