కౌశిక్ రెడ్డి ఏమి తప్పు మాట్లాడలేదు.. 

ktr-14-.jpg

ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటన ముంగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్.. శనివారం ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అసమర్ధుడి జీవన యానంలా రేవంత్ పాలన కొనసాగుతుందని అన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని, ఆయన అటెన్షన్ డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగి ఆయనే కండువాలు కప్పుతున్నారు. 10మంది ఎమ్మెల్యేలు వచ్చారు.. ఇంకా వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలతో కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెరలేపారని కేటీఆర్ అన్నారు. హైకోర్టు నాలుగు వారాలు గడువు ఇచ్చింది.. కోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవి పోతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Share this post

scroll to top