కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదేనన్నారు. తాము లక్ష ఇళ్లు కట్టకపోతే రాత్రికి రాత్రికి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయని కేటీఆర్ ప్రశ్నించారు. చిట్టీ తమ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా అంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ నిజం, అయన హామీలు నిజం, ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా అని ఫైర్అయ్యారు. మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్ కు ఈరోజు కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయన్నారు. కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం-కేటాయింపులు నిజం మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి అంటూ హితవు పలికారు.
మాది నిజం మీది అబద్ధం..
