ఖర్గే జీ, మీరు గతంలో చెప్పినట్లుగా ఒకరి ఇంటిని కూల్చివేసి, వారిని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం. తెలంగాణలోనూ చట్టాలను, న్యాయవ్యవస్థలను ధిక్కరించే చర్య జరుగుతోంది. మహబూబ్‌నగర్‌లో దాదాపు 75 మంది పేద కుటుంబాల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్. కూల్చివేతలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌లో పంచుకున్నారు కేటీఆర్. బాధితుల్లోని 25 కుటుంబాల్లో శారీరక వికలాంగులు కూడా ఉన్నారని చెప్పారు. ఎలాంటి విధి, విధానాలు లేని చట్టం చట్టమే కాదన్న కేటీఆర్.. దయచేసి దేశంలో మరో బుల్డోజర్ స్టేట్‌గా తెలంగాణ మారకుండా రేవంత్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని ఖర్గేను కోరారు కేటీఆర్.
ఖర్గే జీ రేవంత్ కు మీరైనా చెప్పండి..
