పరిశ్రమల అంశంపై కేటీఆర్ విమర్శలు..

ktr-21.jpg

తెలంగాణలో ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన పరిశ్రమలు నాశనం అవుతున్నాయని, దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఊసేలేకుండా ఉండటం విచారకరమని తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేటీఆర్ తన ట్వీట్‌లో ప్రధానంగా బయ్యారంలోని ఉక్కు పరిశ్రమ స్థాపనపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మరోవైపు, ఆదిలాబాద్‌లోని సీసీఐ ఫ్యాక్టరీను వేలానికి పెట్టడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ఈ పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కేటీఆర్ విమర్శించారు.

Share this post

scroll to top