మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ రిక్వెస్ట్ ట్వీట్..

ktr-16.jpg

వరంగల్ లో గురువారం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంత్రులు డబ్బులు తీసుకోని ఫైల్స్ పై సంతకం చేస్తారన్న ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. చివరకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకి చాలా అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ కమీషన్ సర్కార్ నడుస్తోంది. ఇది ఇప్పుడు అందరికీ తెలిసిన ఓ బహిరంగ రహస్యంగా మారింది. ఈ 30% కమిషన్ ప్రభుత్వంలో మంత్రులు, వారి సహచర మంత్రుల ప్రకారమే, భారీ కమీషన్ తీసుకోకుండా ఫైళ్లపై సంతకాలు పెట్టరని చెబుతున్నారు. కాంట్రాక్టర్లు సచివాలయం లోపలే ధర్నా చేయడం ద్వారా ఈ ప్రభుత్వం కమిషన్ వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. ఇలాంటి మంత్రులందరి పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలని నేను కొండా సురేఖని కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ మీరు నియమించిన సొంత మంత్రి చేసిన ఆరోపణలపై దర్యాప్తు విచారణకు ఆదేశించగలరా? అని కేటీఆర్ పేర్కొన్నారు.

Share this post

scroll to top