సీఎం రేవంత్‌కు వార్నింగ్‌.. కేటీఆర్‌ షాకింగ్‌ ట్వీట్‌

ktr-13.jpg

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది!.. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని  దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కాడు రేవంత్ రెడ్డి’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు.’’ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.

Share this post

scroll to top