అమృత్ పథకం టెండర్ల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిన ఢిల్లీలో ఉన్న బీజేపీ కూడా కాపాడటం కష్టమేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయక తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమృత్ పథకం విషయంతో తాను చేసిన వ్యాఖ్యలకు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా ? బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోము. ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్‌లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి ₹1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు
లీగల్ నోటీసులకు భయపడతానా..
