తెలంగాణలో పేద ప్రజల ఇళ్లపై బుల్డోజర్లతో నిర్వహిస్తున్న కూల్చివేతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు తీవ్రంగా విమర్శించారు. వరంగల్ నగరంలో రోడ్డుకే ఆనుకుని ఉన్న పేదవారి ఇళ్లను కూల్చివేసిన ఘటనలపై సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని కేటీఆర్ నేరుగా ప్రశ్నించారు. హలో రాహుల్ గాంధీ, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా? అంటూ ఆయన తన పోస్ట్‌ను ప్రారంభించారు. పేద ప్రజల ఇళ్లపై, వారి జీవనోపాధిపై రోజూ దాడులు చేస్తున్న ఈ అమానవీయ చర్యలకు మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ మీకు ఆ కంపెనీతో రహస్య ఒప్పందం ఉందా..
