అధికారంలోకి రావడం కోసం ఎల్ఆర్ఎస్‌ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు దొంగ మాటలు..

ktr-07.jpg

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి భారీ తగ్గినట్లుగా ఇటీవల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్‌కు సమయం దగ్గర పడిన వేళ రిజిస్ట్రేషన్ శాఖలో రూ.18,229 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ రూ.10,313 కోట్ల రాబడిని మాత్రమే ఆర్జించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే భారీగా పడిపోయిన రిజిస్ట్రేషన్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం వేదికగా ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందుకు అధికారంలోకి రావడం కోసం ఎల్ఆర్ఎస్‌ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు దొంగ మాటలు చెప్పారని ఫైర్ అయ్యారు.

అధికారం దక్కాక ఆదాయం కోసం నేడు ఎల్ఆర్‌ఎస్ ముద్దు అనడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో నిరుపేదలను భయభ్రాంతులకు గురి చేయడం క్షమించరాని నేరమని అన్నారు. ఆర్ఆర్ ట్యా్క్స్ పేరుతో హైదరాబాద్ నగరంలో అరాచకాలకు పాల్పడుతున్నాని ఆక్షేపించారు. మరోవైపు మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చుతున్నారని ఫలితంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయని అన్నారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయి రూ.లక్షన్నర కోట్ల అప్పు ప్రజల పాలిటీ ముప్పు అయి కూర్చుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాల్లో కలిసిపోయాయని కాంగ్రెస్ 15 నెలల పాలన నిర్వాకం మూలంగా రియాల్టర్లు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ గారడీలో సామాన్యులే సమిధలు జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Share this post

scroll to top