తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. స్పీకర్ ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయనను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సభ పున:ప్రారంభం కానుండటంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య రాష్ట్ర అప్పులుపై సభ దద్దరిల్లే అవకాశాలు ఉన్నాయి. అధికారంలోని వచ్చిన 15 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసిందని మీడియాలో వార్తలు వస్తున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
ఇది ప్రజా పాలన కాదు ప్రజలను వేధించే పాలన..
