హాయ్ నాన్న బాగున్నారా అంటూ కొసరి కొసరి వడ్డించిన కుమారీ ఆంటీ. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమెను యూట్యూబర్లు, ఇన్ప్లుయెన్సర్స్ ఇంటర్వ్యూలు చేయడంతో ఒక్కసారిగా ఫేమ్ అయ్యింది. ఆమెపై ఓ వీడియో చేసి ట్రోలింగ్ చేయగా అది ఆమెకు మేలు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కుమారీ ఆంటీ తన మంచి మనస్సును చాటుకుంది. ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాణ, ఆస్థి నష్టం వాటిల్లుతుంది.
అనేక మంది నిరాశ్రయులయ్యారు. అలాగే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ వంతు సాయంగా ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, కుమారీ ఆంటీ తన వంతు ఆర్థిక విరాాళాన్ని అందించింది. వరద బాధితుల సహాయనిధికి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి చెక్ అందించింది ఆమె. సీఎం రేవంత్ రెడ్డి ఆమెను శాలువా కప్పి సత్కరించారు. చిరు వ్యాపారం చేసుకుని బతుకుతున్న ఆమె.. 50 వేల రూపాయల వరద బాధితుల సహాయార్థం అందించి హ్యుమానిటీని ప్రదర్శించి మరోసారి సెలబ్రిటీ అయ్యింది.