ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాటే వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించే దిశగా ఏఐ అడుగులు వేస్తోంది. అయితే, ఇప్పుడు ఏఐ అభివృద్ధి ఉద్యోగులకు చేటు చేయబోతోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా టెక్, ఇతర ఇండస్ట్రీల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. 2025లో భారీ సంఖ్యలో టెక్ లేఆఫ్స్ ఉండబోతున్నాయి. ఇప్పటికే, అన్ని అగ్రగామి టెక్ సంస్థలైన మెటా, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, బీపీ వంటి కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్ నుంచి ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించాయి. ఇవే కాకుండా చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తీసేయబోతున్నాయి. ఎక్కువగా కంపెనీలు తమ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వైపు వెళ్లడానికి, ఖర్చుల్ని తగ్గించుకోవాలని ఉద్యోగుల్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాయి.