మహారాష్ట్రలో వాషిమ్ అనే జిల్లాలో రైతులు తమ వేరుశనగ పంటను అమ్ముతుంటారు. అలాగే ఓ రైతు కూడా తన పంటను విక్రయించడానికి మార్కెట్‌కి వచ్చాడు. కానీ అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. నేలపై పారబోసిన పంట ఒక్కసారిగా వరద నీటికి కొట్టుకుపోతోంది. తన కళ్ల ముందే పంట నాశనమవడం చూసిన ఆ రైతు తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు. జోరుగా కురుస్తున్న వర్షంలో తడుస్తూ వర్షపు నీటికి కష్టపడి పండించిన పంటల కొట్టుకుపోతుంటే దాన్ని కాపాడుకునేందు ప్రయత్నిస్తున్నాడు. తన పంట కొట్టుకుపోతుండటం చూసి రైతు నిస్సహాయంగా వర్షంలో నేలపై కూర్చుని ఒక సంచితో ఆపడానికి ప్రయత్నిస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 39 సెకన్ల ఈ చిన్న క్లిప్ చూసిన జనాలు అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆకస్మిక వర్షాల కారణంగా రైతులు భారీగా నష్టపోతున్నారని ఈ వీడియో ద్వారా మరోసారి స్పష్టమవుతోంది. ప్రభుత్వం స్పందించి ఆ అన్నదాతలను ఆదుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.
కళ్ల ముందే పంట నాశనం.. పంటను రక్షించేందుకు రైతు యత్నం..
