నిన్న మొన్నటి వరకు హీరోల రెమ్యూనరేషన్ విషయంలోనే డిస్కషన్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోయిన్లు కూడా భారీగా రేటు పెంచేస్తున్నారు. సినిమా రేంజ్‌కు తగ్గట్టుగానే తమ పారితోషికం కూడా ఉండాలని పట్టుబడుతున్నారు. గత చిత్రానికి తీసుకున్న నెంబర్స్‌కు ఏమాత్రం సంబంధం లేని రేంజ్‌లో ఉన్నాయి హీరోయిన్ల డిమాండ్స్. ప్రజెంట్ పది కోట్లకు కాస్త అటు ఇటుగానే పారితోషికం అందుకుంటున్నారు దీపిక. కానీ స్పిరిట్ సినిమాకు మాత్రం 20 కోట్లు ఇవ్వాల్సిందే అంటున్నారట ఈ బ్యూటీ. నయనతార కూడా పారితోషికం విషయంలో కాస్త గట్టిగానే ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే సినిమాలో నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు నయన్, 18 కోట్ల డిమాండ్ చేశారన్న ప్రచారం జరిగింది. అయితే అంత కాకపోయినా భారీగానే నయన్‌కు పే చేస్తున్నారట చిత్రయూనిట్.
హీరోల రేంజ్‌లో హీరోయిన్ల డిమాండ్స్..
