పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై మోహన్ బాబు రియాక్ట్..

mohan-babu-14-.jpg

పరారీలో మంచు మోహన్ బాబు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబు అందుబాటులో లేరని పోలీసులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న వెపన్ డిపాజిట్ కోసం మోహన్ బాబు ఇంటికి వెళ్లారట పోలీసులు. రెండు, మూడు రోజుల్లో వెపన్ డిపాజిట్ చేస్తానని మోహన్ బాబు చెప్పారంటున్నారు పోలీసులు. మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు పికెటింగ్ చేశారట. మోహన్ బాబు కోసం గాలింపు చేపట్టడం లేదని స్పష్టం చేశారు పోలీసులు. కానీ మీడియాలో మాత్రం పరారీలో మంచు మోహన్ బాబు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మోహన్‌ బాబు స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు అంటూ కోర్టు విషయాన్ని ప్రస్తావించారు. నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను కోరుతున్నానంటూ పేర్కొన్నారు మోహన్ బాబు.

Share this post

scroll to top