కాసేపటి క్రితం ముగిసిన మట్కా ప్రీమియర్స్ ఈ సినిమాపై మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వరుస ప్లాప్స్ నుండి గట్టెక్కి హిట్ బాట పట్టిస్తుందని ఆశగా ఉన్నాడు వరుణ తేజ్. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
కాగా ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ ముగిసాయి. అందుతున్న సమాచరం ప్రకారం ఫస్ట్ హాఫ్ వరుణ్ తెజ్ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. నాలుగు విభిన్న వయస్కుడిగా వరుణ్ తేజ్ అదరగొట్టాడట. అలాగే ఈ సినిమాలో మరొక పాజిటివ్ అంటే సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్. తన నేపధ్య సంగీతం తో సినిమాను చాలా వరకు నిలబెట్టాడట. సెకండ్ హాఫ్ సినిమాను కాస్త బాగుంటదేమో అని ఎదురు చుసిన ప్రేక్షకుడికి నిరాశ తప్పేలేదట. కరుణ్ కుమార్ రాసుకున్న కథ బాగున్నా, ఆ కథను తెరపై మలచడంలో దర్శకుడు తడబడ్డాడు.