ఇంటింటికీ ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ పదేళ్లు ప్రజలను మోసం చేసిందని ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఆశ చూపించారు. ఎన్నికల తర్వాత మళ్లీ దాని గురించే మాట్లాడరని విమర్శించారు. అబద్ధాలు అద్భుతంగా చెప్పడం లో కేటీఆర్ దిట్ట. పదేళ్లలో ఉద్యోగాలు ఇస్తే.. ఉస్మానియా యూనివర్శిటీకి ఎందుకు వెళ్ళలేదు. డబుల్ పెన్షన్ తీసుకుంటున్న లక్ష్మమ్మ నుంచి రికవారీ చేశారని మా దృష్టికి రాలేదు. మీ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా పెన్షన్ తీసుకున్నారు. సాగు చేసుకుంటున్న రైతులకు మాత్రం ధరణి లో పేరు లేదని రైతు బంధు రాకుండా చేశారు. ప్రతిరోజూ ధనిక రాష్ట్రం, బంగారు తెలంగాణ అంటే బయట ఉన్న మేము నిజమే అనుకున్నాం. మా మానిఫెస్టో చూసి మేము గ్యాస్ సిలెండర్ రూ.500 అంటే మీరు నాలుగు వందలే అన్నారు. ఇలా ఎన్నో పథకాలు పెంచి ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. ఐదేళ్లు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. తప్పకుండా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తామని సీతక్క స్పష్టం చేశారు.
ఇంటింటికీ ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ పదేళ్లు ప్రజలను మోసం..
