బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. బయ్యారంలో లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని చెనప్పారు. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి..
