కేసీఆర్ గొంతు వినగానే కవిత కన్నీటిపర్యంతం..

kcr-29.jpg

ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. భర్త, కుమారుడితో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా కవితకు దిష్టి తీసి సిబ్బంది స్వాగతం పలికారు. కన్న బిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ భోవోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కవిత తండ్రి పాదాలకు నమస్కరించింది. అనంతరం కవితను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు. దీంతో చాలాకాలం తర్వాత కేసీఆర్ మొహంలో ఉత్సాహం కపించించింది.

Share this post

scroll to top