హరీశ్‌ కు మైనంపల్లి సవాల్..

harish-rao-20.jpg

సిద్ధిపేట‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతూనే ఉంది. హరీశ్‌రావు రాజీనామా ఫ్లెక్సీలతో మొదలైన వివాదం ఇరు పార్టీల వారు రోడ్డెక్కి పోటాపోటీగా నిరసనలు తెలిపే స్టేజ్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి హరీశ్‌రావుకు సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే సిద్దిపేటలో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలంటూ ఓపెన్ చాలెంజ్ చేశారు. ఒకవేళ తాను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని హనుమంత రావు కామెంట్ చేశారు. తమపై దాడి చేయించేందుకు హరీశ్ పక్కా ప్లాన్‌ వేశారని ఆరోపించారు. రాజకీయాల్లో హరీశ్ అయినా ఉండాలి.. తానైనా ఉండాలంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. హరీశ్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ఇక సిద్దిపేటలో ఆయన మళ్లీ గెలవబోడని జోస్యం చెప్పారు.

Share this post

scroll to top