పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రంపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కల్కి సినిమా తనకు నచ్చలేదని కల్కిలో ప్రభాస్ ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని అన్నాడు. అలాగే కల్కిలో అమితాబ్ ముందు ప్రభాస్ ఒక జోకర్ లాగా కనిపించాడు. ప్రభాస్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తాడు అంటూ అర్షద్ ఇక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు. అయితే అర్షద్ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. టాలీవుడ్‌ను అనేముందు బాలీవుడ్ ఎలా ఉందో చూసుకోవాలని తెలిపారు. ఇదిలావుంటే తాజాగా ఈ ఘటనపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు.
ఈ ఘటనపై స్పందిస్తూ మనం ఇలాంటివి డిస్కషన్ పెట్టి ఇంకా వెనక్కు వెళ్లొద్దు. ఇండియాలో నార్త్ మూవీ సౌత్ మూవీ, టాలీవుడ్ బాలీవుడ్ అంటూ లేవు. దృష్టి అంతా పెద్ద సినిమాలు తీయడం పైనే ఉండాలి. ఇది యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అర్షద్ వార్సి తన మాటలను బాగా ఎంచుకున్నాడు. అయిన సరే. అతడి పిల్లలకు బుజ్జి బొమ్మలు పంపుతాను. నేను కష్టపడి పని చేస్తున్నాను కల్కి2లో ప్రభాస్ బెస్ట్ అని ఫస్ట్ షోలోనే నిరుపిస్తాను అంటూ నాగ్ అశ్విన్ రాసుకోచ్చాడు.