యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటూ సోషల్ మీడియా కు కూడా దూరం అయింది. ఇక షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు ఆసక్తికర కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి రాజా సాబ్ చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రేక్షకులు ఎక్కువగా నా నుంచి గ్లామర్ పాత్రలను ఆశిస్తుంటారు. నేను కూడా అలాంటి పాత్రలే ఎక్కువగా చేస్తానని భావిస్తారు.
అయితే రాజాసాబ్ తో మాత్రం ప్రజలు కచ్చితంగా నాపై ఉన్న ఈ అభిప్రాయాన్ని మార్చుకుంటారనిపిస్తుంది. ఈ సినిమాలో నా పత్ర రెగ్యులర్ హాట్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పగలను. ఇందులో నా పాత్రను ప్రేక్షకులు ఊహించలేరు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిధి కామెంట్స్ రాజా సాబ్ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.