కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి భారీగా పెంపు..

nirmala-buject-01.jpg

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు 2025సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో 70 శాతం మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. 10 రంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఆమె తెలిపారు. ఆ పదిలో పేదలు, యూత్‌, అన్నదాతలు, మహిళలు ఉన్నట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే పప్పుధాన్యాలలో స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నట్లు చెప్పారు. బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల రుణ పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. KCC ద్వారా ఇచ్చే లోన్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామన్నారు. బీహార్‌లో మఖనా రైతుల కోసం ప్రత్యేక బోర్డు మఖనా ఉత్పత్తి పెంచేలా బోర్డు ద్వారా శిక్షణ ఇస్తామన్నారు.

100 జిల్లాలను ధన్ ధాన్య యోజనతో అనుసంధానిస్తారు. పంట వైవిధ్యీకరణ, నీటిపారుదల సౌకర్యాలు, రుణాలు 1.7 కోట్ల మంది రైతులకు సహాయపడతాయి. పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించే ప్రణాళికలో కందులు, పెసలు, మినుములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది ప్రభుత్వం. ధన్ ధాన్య పథకం కింద, నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ రైతుల నుండి పప్పుధాన్యాలను కొనుగోలు చేస్తాయి. అలాగే మత్స్యకారులకు ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పత్తి ఉత్పాదకత పెంచేందుకు స్పెషల్‌ మిషన్‌ చేపడతామన్నారు. భారతదేశ సాంప్రదాయ పత్తి పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. పత్తి ఉత్పత్తిపై 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ దృష్టి పెడుతుందన్నారు. పత్తి ఉత్పత్తి, మార్కెటింగ్ పై దృష్టి పెట్టామన్నారు.

Share this post

scroll to top