ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ డేట్ మారింది.. 

nill-29.jpg

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్‌ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని పూజా కార్యక్రమాలు నిర్వహించిన రోజు ప్రకటించారు మేకర్స్. కానీ అనుకోని కారణాల కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండడం, మధ్యలో వార్ 2కు ఆగష్టులో ప్రమోషన్స్‌ కోసం డేట్స్ ఇవ్వాల్సి ఉండడం వంటి కారణంగా ఈ సినిమా సంక్రాంతికి రాదు అనే వాదనలు వినిపించాయి. ఆ వాదనలకు తెరదించుతూ న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. 2026 జూన్ 25న ఎన్టీఆర్ నీల్ సినిమాను రిలీజ్ చేస్తామని కొద్దీ సేపటి క్రితం అనౌన్స్ చేసారు. అలాగే యంగ్ టైగర్ పుట్టిన రోజు కానుకగా మే 20న న ఎన్టీఆర్, నీల్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వారం క్రితం యంగ్ టైగర్ ఈ సినిమా సెట్స్ లో పాల్గొన్నారు.

Share this post

scroll to top