చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ తప్పుడు పనులు అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు. ఎన్నికల ముందు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటాం ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఆయన కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో బూర్జ మండలం నారాయణపురం గ్రామం వద్ద నాగావళి నదిలో టీడీపీ నాయకులు రాత్రికి రాత్రి వందల సంఖ్యలో లారీలను తీసుకువచ్చి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న బూర్జ మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడకి వచ్చి ఫోటోలు, వీడియోలు తీసి కలెక్టర్ గారికి పంపించి ఫోన్లో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ ఇసుక తవ్వకాలను నిలుపుదల చేశారు. కానీ అక్కడ 5 మెషీన్లు, లారీలు ఇంతవరకు సీజ్ చేసి కేసు నమోదు చేయలేదు.
చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ తప్పుడు పనులు..
