ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే ఈ సర్వే..

ravanth-07.jpg

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారు వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. ఈ సర్వే దేనికోసమో స్పష్టం చేయాలి. బీసీ వర్గాలను మోసం చేయడానికే ఈ సర్వే అని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే ఈ సర్వే అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టడం సమంజసమా ఎన్నికల్లో ప్రజలను మోసం అధికారంలోకి వచ్చిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Share this post

scroll to top