హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే పహల్గామ్ దాడి..

hafiz-25.jpg

పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక ఉన్న కుట్రను కేంద్ర సంస్థలు వెలికితీస్తున్నాయి. 26/11 ముంబై దాడుల కుట్రదారుడు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోనే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినట్లుగా భద్రతా సంస్థలు ఇక నిర్ధారణకు వచ్చినట్లు వర్గాలు పేర్కొన్నాయి. పహల్గామ్ దాడి జరగగానే తామే ఈ దాడి చేసినట్లుగా ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఇది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఉంది. దీనికి హఫీజ్ సయీద్ ముఖ్య అనుచరుడైన సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి నేతృత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి ఆధ్వర్యంలోనే ఈ ఉగ్ర సంస్థలు నడుస్తున్నాయి. ఇద్దరి మాడ్యూల్ ప్రకారం పహల్గామ్ దాడి జరిగినట్లుగా భారత నిఘా సంస్థలు కనిపెట్టాయి. ఇక ఈ ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సైన్యం, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పూర్తి మద్దతు ఉంటుంది. సైద్ధాంతిక, లాజిస్టికల్ మరియు వ్యూహాత్మక మద్దతు ఇస్తుంటాయి.

Share this post

scroll to top