భారత్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షాను వదిలిపెట్టిన పాక్..

pak-14.jpg

పాకిస్తాన్ రేంజర్లు గత నెల ఫిరోజ్‌పుర్‌ దగ్గర అదుపులోకి తీసుకొన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్ సాహూను ఎట్టకేలకు రిలీజ్ చేశారు. అతడిని ఈ రోజు ఉదయం పంజాబ్‌లోని అటారీ సరిహద్దు వద్ద భారత దళాలకు అప్పగించినట్లు పీటీఐ పేర్కొంది. అయితే, బీఎస్‌ఎఫ్‌ 182వ బెటాలియన్‌కి చెందిన జవాన్ పూర్ణమ్‌ పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ సెక్టార్‌లో డ్యూటీ చేస్తున్నాడు. ఏప్రిల్‌ 23న సరిహద్దు దగ్గర కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా ఆయన కాస్త ఆనారోగ్యానికి గురయ్యారు. దీంతో సమీపంలో ఓ చెట్టు కనిపించడంతో దానికింద రెస్ట్ తీసుకున్నారు. అయితే, ఆ చెట్టు పాక్‌ భూభాగంలో ఉన్న విషయాన్ని గమనించలేకోపోయారు.

Share this post

scroll to top