సరిహద్దుల్లో పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉంది. సుమారు 26 చోట్ల ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించింది. పాకిస్తాన్ దాడులను భారత భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. శ్రీనగర్, అవంతీపూర్, ఉద్ధంపూర్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అలాగే, భారత్ లోని హిందూ టెంపుల్స్, గురుద్వారాలపై దాడులు చేస్తుందని ఇండియన్ ఆర్మీ ఆరోపించింది. ఈ దాడుకుల సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది.
జమ్ముకశ్మీర్ లోని నివాస ప్రాంతాలు, ఆలయాలపై పాకిస్తాన్ నిరంతరం దాడులకు తెగబడుతోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను నెట్టింట పోస్టు చేసింది. జమ్మూలోని శంభూ దేవాలయం ధ్వంసమైనట్లు రక్షణ శాఖ ఫొటోలు, వీడియోను రిలీజ్ చేసింది. రాత్రంతా డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉందని చెప్పుకొచ్చింది. పాక్ కాల్పులు, డ్రోన్లను భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు సాయుధ బలగాలు కృతనిశ్చయంతో రెడీగా ఉన్నాయని తెలిపింది.