నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..

parlamint-31.jpg

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ఇవి స్టార్ట్ కానున్నాయి. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో రేపు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్‌ను ఆమె సభకు సమర్పించనున్నారు. అయితే, ఈసారి బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఈరోజు నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకూ జరుగుతాయి. తొలి విడత ఫిబ్రవరి 13వ తేదీ జరగనుండగా సెకండ్ విడత మార్చ్ 10 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకూ జరగబోతున్నాయి. కాగా, నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుండటం ఇది వరుసగా 8వ సారి కావడం విశేషం.

Share this post

scroll to top