పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్‌కి బై చెప్పి… అధికార కాంగ్రెస్‌కి జై కొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో హ్యాపీగా హస్తంపార్టీకి నేస్తమయ్యారు మహిపాల్‌రెడ్డి. గూడెం మహిపాల్‌రెడ్డి చేరికతో పటాన్‌చెరు పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఒకరంటే ఒకరికి పడని ముగ్గురు నేతలు ఒకేపార్టీలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. నీలం మధు, కాటా శ్రీనివాస్, మహిపాల్ రెడ్డిల రిలేషన్ ఎలా ఉండబోతోంది..? ఒకప్పుడు తెగ కొట్టుకున్న ముగ్గురు. కలిసి ముందుకెళ్తారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్‌లో రచ్చ లేపుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో.. పటాన్‌చెరులో పొలిటికల్ సీన్ ఆసక్తికరంగా మారింది. నీలం మధు – కాటా శ్రీనివాస్.. వీళ్లిద్దరూ ఒకే ఒరలో ఉన్న రెండు కత్తులు. అలాంటి కత్తుల మధ్య గూడెం చేరిక మరింత అగ్గిరాజేసినట్టయింది.
మహిపాల్ రాకతో మరీ ఇంట్రస్టింగ్..
