పవన్ సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన..

pavan-kalyan-14-.jpg

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారిగా నటిస్తోన్న హిస్టారికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. దయాకర్‌ రావు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తం రెండు భాగాలుగా హరి హర వీరమల్లు తెరకెక్కుతోంది. మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే దాదాపు తుది దశకు చేరుకుంది. కాగా హరి హర వీరమల్లు సినిమా మార్చి ఆఖరులో రిలీజ్ చేస్తామని ఇది వరకు మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో మే 9కు వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పాడిన మాట వినాలి సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొట్టింది. ఇక ఇటీవలే రిలీజైన కొల్లగొట్టినాదిరో పాట లిరికల్‌ వీడియోకు కూడా మంచి స్పందనే వచ్చింది. ఈ సినిమాకు కీర వాణి స్వరాలు సమకూర్చారు.

Share this post